Uttam Kumar Reddy on Modi: విదేశాంగ విధానంలో మోడీ వైఫల్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy on Modi: భారత ప్రధాని మోడీ పైన తీవ్ర విమర్శలు చేశారు టీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మోడీ అనుసరిస్తున్న విధానాల వలన భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ మనకి శత్రువులుగా మారుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.. రష్యాలాంటి మిత్రదేశం కూడా ఇలాంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదని అయన అభిప్రాయపడ్డారు.

Update: 2020-06-26 14:01 GMT

భారత ప్రధాని మోడీ పైన తీవ్ర విమర్శలు చేశారు టీపీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.(Tpcc Chief Uttam Kumar Reddy) మోడీ అనుసరిస్తున్న విధానాల వలన భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ మనకి శత్రువులుగా మారుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.. రష్యాలాంటి మిత్రదేశం కూడా ఇలాంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదని అయన అభిప్రాయపడ్డారు. ఈరోజు(శుక్రవారం) గాంధీభవన్ లో అమరవీరులకు సలాం కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అయన ఈ వాఖ్యలు చేశారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రదేశాలు ఒక్కొక్కటిగా భారత్ కి శత్రువులుగా మారుతున్నాయని, విదేశాంగ పాలసీ విదేశీ రక్షణలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. మోదీ ఇప్పటిదాకా చేసిన విదేశీ పర్యటనల వల్ల మన దేశానికి ఏ ప్రయోజనం జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 45 ఏళ్ల కాలంలో ఇండియా చైనా సరిహద్దుల్లో ఒక్క సైనికుడు కూడ మరణించలేదన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక చైనాతో జరిగిన హింసాత్మక పోరులో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలంగాణ వీరుడు కల్నల్ సంతోష్ బాబు అని అన్నారు. ఈ సందర్భంగా అయన సేవలను ఉత్తమ్ కొనియాడారు. బార్డర్ లో ఆయన చేసిన సేవలు అమోఘం అని అన్నారు. తెలంగాణ చరిత్రలో సంతోష్ బాబు నిలిచిపోతారని ఉత్తమ్ అన్నారు. అటు దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్న కృషిపై ఉత్తమ్‌ అభినందనలు తెలిపారు.

ఈ నెల 28 నుంచి దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను కాంగ్రెస్ అద్వర్యంలో జరపాలని ఉత్తమ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తల గుండెల్లో పీవీ నరసింహారావు ఉంటారని ఉత్తమ్‌ అన్నారు. 


Tags:    

Similar News