Revanth Reddy: తెలంగాణలో విద్యుత్తు కోతలు రైతులకు గుండెకోత
Revanth Reddy: పంటచేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు ఎందుకు?
Revanth Reddy: తెలంగాణలో విద్యుత్తుకోతలు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయని టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్తుకోతలు రైతులపాలిట ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నారు. పంటలు పూర్తయ్యే దాకా నిర్విరామంగా విత్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తర్వాత విద్యుత్ కోతలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్లు విద్యుత్తు వ్యవస్థలకు అప్పులు మిగిలాయన్నారు.
పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి
— Revanth Reddy (@revanth_anumula) April 15, 2022
కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడు
కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు…విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయి.ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే. pic.twitter.com/QovUODYTgB