రేపు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

* గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికపై చర్చ * జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్ధి ఎంపికపైనా చర్చించనున్న కేసీఆర్ *వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపైనా దిశానిర్దేశం

Update: 2021-02-06 02:16 GMT

Representational Image

కేటీఆర్‌కు పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయిందా..? కేసీఆర్ సీఎం కుర్చీ దిగి పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైపోయారా..? తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రమంతా ఇదే చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకు రేపటితో క్లారిటీ వస్తుందా..? కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీసుకునే కీలక నిర్ణయాలేంటి? 

రేపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు కేటీఆర్‌ను సీఎం చేస్తారా అనే అంశంపై కీలక ప్రకటన చేస్తారనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కాబోయే తెలంగాణ సీఎం అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జోరందుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం అవుతారనే కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

ఇక ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక పార్టీ బలోపేతం అంశాల కంటే కేటీఆర్‌ను సీఎం చేసే అంశమే ప్రధానంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ అధి శ్రావణ యాగం నిర్వహిస్తుండటంతో.. కేటీఆర్‌ను సీఎం చేయాలనే ఉద్దేశంతోనే యాగం నిర్వహిస్తున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసీఆర్ మనసులో ఉన్నది అదే అయితే యాగం జరిగిన తర్వాత కేటీఆర్ పట్టాభిషేకానికి అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News