ప్రముఖ నిర్మాత 'పివిపి' పై కేసు..అరెస్ట్ తప్పదా?

Update: 2020-06-24 15:01 GMT

ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పివిపి) అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో బంజారాహిల్స్ పోలీసులు పివిపి అరెస్టును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇప్పటికే పలు సెక్షన్ల కింద పివిపి పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది..

ఏడాది క్రితం పివిపి విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్. అయితే ఆ సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా విక్రయించారు అంటున్నారు ఆయన… కానీ ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే వద్దని పివిపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా.. పివిపి తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 40 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కైలాష్.. దీంతో కైలాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ పీఎస్‌లో పివిపిని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో పీవీపీ పై కేసు బుక్ చేసిన పోలీసులు ఆయనను ప్రశ్నించారు. తరువాత అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం.  

Tags:    

Similar News