హాట్ హాట్‌గా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ సమీక్ష
Manickam Tagore: నేతల తీరుపై మండిపడ్డ మాణిక్కం ఠాగూర్.
Manickam Tagore: హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన డిజిటల్ సభ్యత్వ సమీక్ష హాట్ హాట్ గా జరిగింది. నేతల తీరుపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు. పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్యక్షనత జరిగిన సమావేశంలో రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ నేతల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వం రీచ్ కాని నేతలు ఏ స్థాయి వారైనా పక్కకు పెడుతామంటూ ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటు డీసీసీ సమావేశంలో సీనియర్లను హెచ్చరించారు. నాయకుల చుట్టు తిరగడం, కండువాలు కప్పి రాజకీయం అనుకోవద్దని ఠాగూర్ సూచించారు.
ఇటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు, ప్రజా సమస్యలు, కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇవాళ తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు చేయనున్నారు. రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ పార్టీని నడిపిస్తున్నారని సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సమావేశంలో కన్నీటి పర్యంతం అయినట్లు తెలిసింది.సమావేశానికి హాజరైన నేతల కంటే డుమ్మా కొట్టిన నేతలే ఎక్కువగా ఉన్నారు. డుమ్మా కొట్టిన నేతలపై మాణిక్కం ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.