Bhadradri Kothagudem: అమరారంలో పులి సంచారం.. భయాందోళనలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు

* రెండు మూగజీవాలను బలితీసుకున్న రెండు పెద్ద పులులు

Update: 2021-11-15 05:33 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమరారంలో పులి సంచారం(ఫైల్ ఫోటో)

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో పులి అడుగుజాడలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. రెండు రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మణుగూరు డివిజన్‌లోని ఏడేళ్ల బయ్యారం రేంజ్ పినపాక అటవీ ప్రాంతాల్లోని జూలపల్లి చెరువు సమీపంలో రెండు పెద్దపులులు ఆవుపై దాడిచేసి చంపాయి.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు రెండు రోజుల క్రితం కరకగూడెం మండలంలో కనిపించిన పులి ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా అడవుల్లోకి వెళ్లవద్దని, పులులకు ఎలాంటి హాని కలిగించవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. పులులను కనిపెట్టేందుకు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాడువాయి అడవుల్లో పులి సంచారాన్ని అటవీ అధికారులు నిర్ధారించారు. ఎటుర్ నాగారం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా మణుగూరు డివిజన్‌లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులపాటు నలుమూలల సంచరిస్తోన్న పులి పలుచోట్ల ఆవులపై దాడి చేసింది.

Tags:    

Similar News