Hyderabad: హైదరాబాద్ లో 3 రోజులు పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
Hyderabad: ఈ నెల 26 నుంచి 28 వరకు జియాగూడ సబ్జిమండీలో ఉత్సవాలు
Hyderabad: నాన్ వెజ్ అంటే నోరూరుతుంది. అందులో ఫిష్ అంటే చాలామందికి ఇష్టం. అయితే చేపలతో కొన్ని వంటకాలు మాత్రమే చేసుకోగలం అని అందరూ భావిస్తుంటారు. కాని ఫిష్ తో మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ లాగా చాలా వంటకాలు చేసుకోవచ్చు అని చెబోతోంది ఈ ఫుడ్ ఫెస్టివల్.
నాన్ వెజ్ వంటకాలలో ఎంతో ప్రత్యేకమైంది ఫిష్. వంట సరిగ్గా కుదరాలే గాని లొట్టలేసుకొని తింటు ఉంటాం. అయితే అలాంటి చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలంటూ హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఈనెల 26వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సబ్జి మండిలో ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
ఈ ఫెస్టివల్‌లో మొత్తం 22 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా సంఘాల గ్రూపులు కూడా పాల్గొంటున్నాయి. ఫెస్టివల్‌లో 40 రకాల చేపలు, రొయ్యలు, పీతలతో చేసిన వంటకాలను ప్రదర్శిస్తున్నారు.
చేపల వినియోగాన్ని భారీగా పెంచడం, చేపలతో రకరకాల వంటకాలు ఎలా చేసుకోవచ్చో వినియోగదారులకు అవగాహన కల్పించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం వరకు జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వయించనున్నారు.