Hyderabad: డెక్కన్‌మాల్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

Hyderabad: గుర్తుపట్టలేని విధంగా కాలిబూడిదైన మృతదేహాలు

Update: 2023-01-20 07:14 GMT

Hyderabad: డెక్కన్‌మాల్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

Hyderabad: రామ్‌గోపాల్‌పేట డెక్కన్‌మాల్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిబూడిదయ్యాయి. మృతదేహాలను అధికారులు గుర్తించలేకపోతున్నారు. వసీమ్‌, జునైద్‌, జహీర్‌ మృతదేహాలను క్లూస్‌టీం పరిశీలిస్తుంది. FSL, DNA రిపోర్టు ఆధారంగా మృతదేహాల అవశేషాలు పోలీసులు గుర్తించనున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు డెక్కన్ బిల్డింగ్‌ను జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. భవన సామర్థ్యాన్ని టెక్నికల్ టీమ్‌ పరిశీలిస్తుంది. మంటల ధాటికి పిల్లర్లలోని ఐరన్ కాలిపోయినట్లు గుర్తించారు. బిల్డింగ్ రీ ఇన్ఫోర్స్‌మెంట్ కాంక్రీట్‌ను నిట్ డైరెక్టర్ పరిశీలించారు. 2006లో లివింగ్ కాంప్లెక్స్ అనుమతులు తీసుకున్న బిల్డింగ్ యజమాని.. కమర్షియల్ యాక్టివిటీస్ కొనసాగించినట్లు గుర్తించారు.

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత వచ్చినప్పుడల్లా.. రెగ్యులరైజ్‌ చేసి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్‌లోని గోడౌన్లన్నీ పరిశీలించాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News