Indian Students: షాకింగ్ సీన్.. రెస్టారెంట్లో వెయిటర్ జాబ్ కోసం క్యూలో నిలబడిన వేల మంది ఇండియన్ స్టూడెంట్స్?

Indian Students In Canada: మాస్టర్స్ చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉపాధి అవకాశాల కోసం ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలిపే షాకింగ్ సీన్ ఇది.

Update: 2024-10-06 07:05 GMT

Indian Students In Canada: మాస్టర్స్ చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉపాధి అవకాశాల కోసం ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలిపే షాకింగ్ సీన్ ఇది. కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో తందూరి ఫ్లేమ్ పేరుతో కొత్తగా ఏర్పాటైన ఓ రెస్టారెంట్ వాళ్లు తమ హోటల్లో వెయిటర్స్, సర్వర్స్ కావాలని ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయగా, అది చూసి ఆ ఉద్యోగాల కోసం వేల మంది విదేశీ విద్యార్థులు అక్కడ హోటల్ బయట క్యూలో నిలబడినట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మేఘ్ అప్‌డేట్స్ అనే ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేసిన డీటేల్స్ ప్రకారం ఇక్కడ క్యూలైన్లో నిలబడిన 3 వేల మంది విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు ఇండియన్ స్టూడెంట్స్ అని తెలుస్తోంది.

కెనడాలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని సదరు ట్విటర్ యూజర్ తమ పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు.. ఎన్నో ఆశలతో కెనడా వచ్చే వాళ్లు ఒకసారి పునరాలోచించుకోవడం బెటర్ అని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో వైరల్ అవుతోంది. కెనడా వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చిన్నచిన్న ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారా అనే చర్చకు దారితీసింది. ఆర్థిక మాంధ్యంతో ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదేమోనని కొంతమంది సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నుండి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకునే దశలో విద్యార్థులు ఇలా రెస్టారెంట్లలో పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం అనేది సర్వసాధారణమే కదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అక్కడివరకు సరే కానీ ఆ ఉద్యోగానికి కూడా అలా వేల మంది లైన్లో నిలబడటం అంటే అది ఆలోచించాల్సిన విషయమే కదా అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అందరి పరిస్థితి ఒకేలా ఉండదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వెళ్లిన దేశాన్ని, అక్కడి స్థానిక స్థితిగతులను బట్టి అక్కడ ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి అనేది ఇంకొంతమంది సలహా. ఇదిలావుంటే, మరోవైపు ఈ వీడియో వాస్తవమైనదేనా అనే చర్చ కూడా ఉన్నప్పటికీ.. ఆ విషయంలో ఇంకా సరైన స్పష్టత లేదు.

Tags:    

Similar News