బాసర ట్రిపుల్ ఐటీలో మూడోరోజు విద్యార్థుల ఆందోళన
Basara: *కలెక్టర్, స్టూడెంట్స్‌తో జరిపిన చర్చలు విఫలం
Basara: బాసర ట్రిపుల్ ఐటీలో మూడోరోజు విద్యార్థుల ఆందోళన కంటిన్యూకానుంది. కలెక్టర్, స్టూడెంట్స్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వెంటనే 6 డిమాండ్లను పరిష్కరిస్తామని... అయితే మిగతా 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అధికారులు. దీంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ట్విట్టర్ ద్వారా మంత్రులు చేసిన రిక్వెస్ట్‌ను స్టూడెంట్స్ తిరస్కరించారు. నిన్న రాత్రి భారీ వర్షంలోనూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోపక్క విద్యార్థుల ఆందోళనకు మద్ధతు పెరుగుతోంది. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు.. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఛీఫ్‌లు ఇతర పార్టీల నేతల సంఘీభావం తెలిపారు.