సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దొంగల హల్చల్
Secunderabad: ఫ్లాట్ ఫామ్‌లు, స్టేషన్‌లో రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు
Secunderabad: రైల్వే ప్లాట్ ఫామ్ లు....వెయిటింగ్ హాల్ లు వారి అడ్డాలు...సాధారణ ప్యాసింజర్లలా ఇతర ప్రయాణికులతో కలిసి ఉంటారు..కానీ వారి నజర్ మొత్తం ఇతర ప్రయాణికుల బ్యాగులు, వస్తువుల పైనే...అదును చూసి ఉన‌్నదంతా దోచేయడం ఈ ముఠా స్పెషల్...ప్లాట్ ఫామ్ లు, స్టేషన్ లోని రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి దొంగతనాలు చేయడంలో వీరు దిట్ట...ఇంతకీ ఈ ముఠాలో ఎంత మంది సభ్యులు ఉన్నారు..?? ఎంత కాలంగా ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు..?? రైల్వే పోలీసుల సూచనలు ఎంటీ...
ఉత్తరప్రదేశ్ కు చెందిన రవీంద్ర కుమార్, వనపర్తికి చెందిన సంజీవ్ కుమార్ ఇద్దరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 10వ నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద ఉంటారు. స్టేషన్ మొత్తం తిరగడం...ముఖ్యంగా వెయిటింగ్ హాల్ లో ట్రైన్ ల కోసం వేచి చూసే ప్రయాణికులే టార్గెట్ గా స్కెచ్ వేస్తారు...వారి కదలికలు, పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని వారి వద్ద ఉన్న బ్యాగులు, ఇతర విలువైన వస్తువులను దొంగలిస్తారు. గత కొంతకాలంగా పోలీసులు కళ్లుగప్పి వీరు ఇద్దరు ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నారు..
దొంగలిద్దరు దొంగతనం చేసిన సొత్తును మొత్తం బిందేల మధు, మాదారపు సాంబశివల వద్ద అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు..ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు. వీరి గతంలో 7 దొంగతనాలకు పాల్పడినట్లు తేల్చారు. వీరి వద్ద నుండి 25 తులాల బంగారం, 1లక్ష 10వేల నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు సొత్తును కొనుగోళ్లు చేసి డబ్బులు ఇస్తున్న ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
పండుగలు, వేసవి సెలవుల దృష్యా రైల్వే స్టేషన్లల్లో ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు...ఎవ్వరి పై అనుమానం వచ్చిన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు అధికారులు.