Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..నాగార్జున సాగర్ వెళ్లేవారికి అలర్ట్
Rain Alert: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో చూద్దాం.
Rain Alert: భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. పశ్చిమం నుంచి వచ్చే గాలులు, మేఘాలను తెలుగురాష్ట్రాలకు మోసుకువస్తున్నాయి. కేరళ నుంచి గుజరాత్ వరకు ద్రోణి అలాగే ఉంది. నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఉదయం 10గంటల వరకు ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షం పడుతుంది.ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వర్షలు కురుస్తాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మధ్యాహ్నం 4గంటల తర్వాత హైదరాబాద్, పశ్చిమ తెలంగాణలో కూడా వర్షాలు పడుతాయి. మధ్యాహ్నం తర్వాత కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో సాయంత్రం నుంచి చాలా చోట్ల జల్లులు కురుస్తాయి. హైదరాబాద్ లో అర్థరాత్రి వరకు అక్కడక్కడ వర్షం పడుతుంది. అర్థరాత్రి కోసతా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
కాగా ఇవాళ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో తేమ కొంత ఉంటుంది. తెలంగాణలో యావరేజ్ గా 64శాతం, ఏపీలో 61 శాతం ఉంటుంది. అందువల్ల మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు..మేఘాలను ద్రుష్టిలో ఉంచుకుని..ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వెళ్లేవారికి వాతావరణం బాగుంటుంది.