TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
TS High Court: ఈ ఫైలింగ్ ద్వారా పిటిషన్ల దాఖలుకు అవకాశం
TS High Court: తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగిత రహితంగా కేసుల విచారణ చేపట్టేందుకు నూతన విధానానికి హైకోర్టు శ్రీకారం చుట్టింది. ఈ-ఫైలింగ్ ద్వారా పిటిషన్ల దాఖలుకు హైకోర్టు అవకాశం కల్పించింది. నేటి నుంచి హైకోర్టులో పిటిషన్లు ఈ-ఫైలింగ్ సాంకేతికతను ఉపయోగించుకుని కేసుల విచారణ చేపట్టే నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియలో మొదట ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లకు అన్ని రకాల కేసుల్లో ఈ-ఫైలింగ్ ద్వారా పిటిషన్ల దాఖలుకు హైకోర్టు అవకాశం కల్పించింది.
ఇతర న్యాయవాదులు, పార్టీ ఇన్ పర్సన్లు ఆదాయపు పన్ను కేసుల్లో ఈ-పిటిషన్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. ఆయా న్యాయవాదులు తమ బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, ఫోన్ నెంబర్ , ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలను హైకోర్టు సీఐఎస్‌లో సమర్పించాలని సూచించింది. అలానే హైకోర్టు జారీ చేసిన కంప్యూటర్ కోడ్‌ను సమర్పించాలని ఆదేశించింది. ఈ-ఫైలింగ్ చేసిన న్యాయవాదులు అవసరమైన సమయంలో కోర్టుకు ఆయా పత్రాలను పేపర్ రూపంలో అందజేస్తామని హామీ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ఈ-ఫైలింగ్ కాపీల ఉచిత స్కానింగ్‌కు హైకోర్టు ఆవరణలోని ఈసేవ కేంద్రంలో ఏర్పాట్లు చేశారు.