Second Wave: మొదటి దశ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తోన్న సెకండ్ వేవ్

Second Wave: కరోనా బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Update: 2021-04-05 08:16 GMT

కరోనా (ఫైల్ ఫోటో)

Second Wave: మొదటి దశ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కరోనా బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి క్వారంటైన్ సెంటర్లను తెరవాలని నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ట్రేసింగ్- టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడికి కొత్త యాప్ రూపొందించింది. PHC స్థాయి వరకు రాపిడ్ యాంటీ జెన్ టెస్ట్‌లు చేస్తున్న నేపద్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్ వ్యక్తులకు వెంటనే మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించే విధంగా నూతన ఆప్ రూపకల్పన చేసింది.

గతంలో కరోనా చికిత్స అందించిన రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా అసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా టీబీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్‌ను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్ సెంటర్‌లుగా మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది అనుభవాలతో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.

హోమ్ ఐషోలేషన్ లో ఉన్న రోగులకు కరోనా మెడికల్ కిట్ అందించడంతో పాటు వారికి టెలిఫోన్ ద్వారా వైద్య సలహాలను ఆరోగ్య శాఖ అందిస్తుంది. ప్రభుత్వం నిర్ధారించిన రేట్ల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం అందించాలని ప్రభుత్వం కోరింది. కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖలను సమన్వయంగా పని చేస్తు్న్నాయి.

కరోనా వ్యాప్తి ని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్లు, హాస్టళ్లు మూసివేత, మాస్కులు తప్పనిసరి, కరోనా రూల్స్ పాటిస్తూ పండగలు జరుపుకోవాలని ఆ జీవోలలో ఉన్నాయి. .108 కి ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కరోనా రోగులను తరలిస్తారు. 45 ఏళ్ల పైబడ్డవారు టీకాలు వేయించుకోని వైరస్ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది.

Full View


Tags:    

Similar News