Etela Rajender: తెలంగాణలో అసలైన పొలిటికల్ వార్ షురూ
Etela Rajender: టీఆర్ఎస్‌లో ఈటల ప్రస్థానం ముగిసింది. ఇక మిగిలింది హుజూరాబాద్ పోరు మాత్రమే.!
Etela Rajender: టీఆర్ఎస్‌లో ఈటల ప్రస్థానం ముగిసింది. ఇక మిగిలింది హుజూరాబాద్ పోరు మాత్రమే.! అయితే, ఈ రణరంగంలో నిలిచేదెవరు..? గెలిచేదెవరు..? గులాబీ దళం ఈటలను ఢీకొట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది..? కాషాయ కండువా ఈటలను గెలిపిస్తుందా..? ఇలా ఒకటీ రెండూ కాదు అన్నీ ప్రశ్నలే.. అసలు హుజూరాబాద్ పోరులో విక్టరీ కొట్టేదెవరు..?
ఈటల రాజీనామాతో హుజూరాబాద్ జాగా ఖాళీ అయింది. దీంతో తెలంగాణలో అసలైన పొలిటికల్ వార్ షురూ అయింది.! ఓ వైపు ఈటల సొంత నియోజకవర్గం మరోవైపు తిరుగులేని గులాబీ దళం. ఈ రెండింటిలో విజయం ఎవరిది.? టీ పాలిటిక్స్‌లో ఇప్పుడిదే హాట్‌టాపిక్.! అయితే, ఈటలను ఢీకొట్టేందుకు అధికార పార్టీ తిరుగులేని రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈటల స్వగ్రామం కమలాపూర్ వేదికగా రాజకీయ వ్యూహాలు షురూ చేసింది అధికార పార్టీ. ఈ ఉపఎన్నికకు ట్రబుల్ షూటర్ హరీశ్ నేతృత్వంలో ఓ కమిటీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఈటలను సొంత గడ్డపై ఓడించడమే లక్ష్యంగా అధికార పార్టీ పక్కా ప్రణాళికతో రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నాయకులను నియోజకవర్గంలో మోహరించింది. రెడ్డి సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు రాబట్టేందుకు చల్లాధర్మారెడ్డి గాలం వేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలుచోట్ల నిర్వహించిన సమావేశాలు పెట్టి లోకల్ లీడర్స్‌కు దిశానిర్థేశం చేస్తున్నారు. ఈటల వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని, బీజేపీ వైఖరిని కార్యకర్తలకు చెబుతూ ఉత్సాహపరుస్తున్నారు.
మరోవైపు బీజేపీ సైతం హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈటల బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్‌లో వార్ సైరన్ మోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఉప పోరుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులను రంగంలోకి దించాలని కమల దళం భావిస్తుంది. పర్యవేక్షకులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి వ్యవహరించనుండడంతో హుజూరాబాద్ పోరు ఆసక్తి రేపుతోంది. హుజూరాబాద్ సాక్షిగా దుబ్బాక ఎపిసోడ్ రిపీట్ చేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈటలను గెలిపించి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది.
వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో హుజూరాబాద్ రాజకీయా రణరంగాన్ని తలపిస్తోంది. గులాబీ పార్టీ సాగర్ బైపోల్ వార్‌ను, కమల దళం దుబ్బాక విక్టరీని రిపీట్ చేయాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ బాద్ షా ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది.!