Congress Operation Akarsh: కొనసాగుతున్న టీ.కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్
Congress Operation Akarsh: కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్ఎస్ నేతలు
Congress Operation Akarsh: తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హస్తం పార్టీలో చేరగా...ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్‌గా జాయినింగ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఫిరాయింపుల ప్రక్రియలో..ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ రాకుండా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందనే చర్చ గాంధీభవన్ సర్కిల్స్‌లో జోరుగా జరుగుతోంది. అందులో భాగంగా.. నాడు బీఆర్ఎస్ అమలు చేసిన వ్యూహాన్నే కాంగ్రెస్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుని..బీఆర్ఎస్ఎల్పీ విలీనమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం..