Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు రిజర్వ్... రేపు తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు
Phone Tapping Case: రేపు తీర్పు ప్రకటించనున్న నాంపల్లి కోర్టు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. రేపు ప్రకటించనుంది. ఛార్జ్‌షీట్ వేయకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా.. జూన్ 10నే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్‌షీట్ లేదు కాబట్టే.. డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా.. పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. రేపు తీర్పు వెలువడనుంది.