రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఝార్ఖండ్, బీహార్ ఇతర రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కేంద్రం అణచివేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. తనిఖీల్లో భాగంగా ప్రతి వాహనాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఆయా ప్రాంతాల్లో కనిపించినట్లు అనిపిస్తే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఫారెస్ట్ ఏరియాల్లో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్నాయి. గత కొన్నిరోజులుగా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఏపీలోని చింతూరులో వాహనాలపై దాడులకు పాల్పడి కారుకు నిప్పుపెట్టడంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురయ్యారు. మరో వైపు మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, గ్రామాలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.