Colonel Santosh Babu:సాహసధీరునికి జనగణమన జేజేలు!
వీరుడా! నీ త్యాగానికి పుడమి పులకరిస్తోంది. భారతావని కన్నీటిని అదిమిపెట్టుకుని నీకు వీడ్కోలు చెబుతోంది. జననేస్తమా! నీ మరణంకూడా శత్రువుల గుండెల్లో ఫిరంగి మోతల అదురుపుట్టించాలానే విధంగా జనాళి నీకు అశ్రునయనాలతో నీరాజనం పలుకుతోంది!
మరణం అందరికీ వస్తుంది. పుట్టిన నాటి నుంచి.. తనువు చాలించే వరకూ ఎన్నో స్థాయిలు దాటుతూ జీవితం సాగుతుంది. ఏ స్థాయిలో ఎలా జీవించినా కన్నుమూసినపుడు కనీసం మనిషిగా కూడా మిగిలేది అతి కొద్ది మందే. మరణంలో కూడా అమరత్వాన్ని పొందేది వేళ్ళమీద లెక్కపెట్టగాలిగెంత మందే. జనం కోసం జీవిత త్యాగం చేసే సైనికుల మరణం అత్యంత విజయవంతమైన జీవితం. కల్నల్ సంతోష్ బాబు ఇప్పుడు కోట్లాదిమంది ఇంటి సభ్యుడు. తన తెగువ లక్షలాదిమంది యువతకు ఆదర్శం. ఆయన మరణం వేలాది మంది సైనికులకు సరికొత్త తెగువ.
అమ్మ మనసు దేశభక్తుడిని కన్నానని ఉప్పొంగిపోతోంది. పేగు కోత కూడా ఆ తల్లికి గర్వకారణంగా మారింది. కట్టుకున్నవాడు తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయినా ఆయన వెళ్ళిన బాట సంతోష్ బాబు భార్యకు ఊరట ఊపిరిని అద్దుతోంది. సంతోష్ బాబు దేశం కోసం ప్రాణమిస్తే.. ఆయన త్యాగానికి దేశప్రజలంతా ముక్త కంఠంతో జేజేలు పలుకుతున్నారు.
ఆయన పార్థివ దేహం అంతిమ సంస్కారానికి వెళుతుంటే.. జన యాత్ర అయన తోడుగా ఆయన త్యాగానికి ఇస్తున్న గౌరవానికి సంకేతంగా సాగింది. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఆ దృశ్యమాలిక మీకోసం..