Pawan Kalyan: మోడీ సభలో పవన్ తూటాలు మిస్ ఫైర్ అయ్యాయా..?
Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు ఓటు వేయాలని పవన్ చెబుతారా..?
Pawan Kalyan: బీజేపీ సభలో పాల్గొన్న జనసేనా అధినేత పవన్ కళ్యాణ్.. కేసీఆర్ సర్కార్‌ఫై పెద్దగా విమర్శలు చేయలేదు. మోడీని పొగిడేందుకే ఎక్కువ టైం కేటాయించారు. ఏదో మాట్లాడలేదు అన్నట్టుగా.. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రశ‌్నలు లేవనెత్తారు. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని,, ఇప్పుడా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా, సంక్షేమ ఫలాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న అన్నారు జనసేనాని.
బీఆర్ఎస్ ఫాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని పవన్ భావిస్తే.. మోడీ సభలో ఎందుకు బలంగా ప్రశ్నించలేదు..? కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, బండి కేసీఆర్‌ఫై విమర్శలు గుప్పిస్తుంటే..పవన్ కల్యాణ్ ఎందుకు పొడిపొడి మాటలు మాట్లాడారు..? మిత్రుడు మోడీ పక్కనుండగా పవన్ భయానికి కారణాలేంటి..? అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే తెలంగాణలో కేసీఆర్ పాలనపై పవన్ సంతృప్తిగా ఉన్నారా..అందుకే బీఆర్ఎస్ సర్కార్‌ఫై పెద్దగా విమర్శలు, ఆరోపణలు చేయలేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్..తన పార్టీ అభ్యర్థులకు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు..? ఎవరిని విమర్శించి ఓట్లు ఆడగాలి అని సూచించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో పాలన బాగోలేదు కాబట్టే... నసేన అభ్యర్థులకు ఓటు వేయాలని పవన్ చెబుతారా..? అనే చర్చ నడుస్తోంది.
గతంలోనూ కేసీఆర్ సర్కార్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు పవన్. కేసీఆర్ సర్కార్‌తో మిత్రుత్వాన్నే కోరుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సంక్షేమ ఫలాలు బాగున్నాయని..గతంలో చాలా సార్లే మెచ్చుకున్నారు పవన్. ఇప్పుడు సెడన్‌గా బీజేపీతో కలిసి పోటీ చేస్తుండడంతో..పవన్ వ్యూహం ఎలా ఉండబోంతోంది. కర్ర విరగడకుండా,, పాము చావకుండా ఎలాంటి ప్లాన్‌ను అమలు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.