Adilabad: గ్రామానికి రోడ్డు లేకపోవడంతో.. నిండు గర్భిణీని బురదలో నడిపిస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా చిన్ను మారుతిగూడ గ్రామంలో ఘటన

Update: 2023-07-20 10:52 GMT

Adilabad: గ్రామానికి రోడ్డు లేకపోవడంతో.. నిండు గర్భిణీని బురదలో నడిపిస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

Adilabad: మారుమూల గ్రామాల్లో పరిస్థితులింకా మారడం లేదు. చిన్నపాటి వర్షానికే రాకపోకలకు గ్రామస్తులు అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో నిండు గర్భిణీ తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిన్ను మారుతిగూడ గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి నొప్పులు వచ్చాయి. దీంతో వర్షంతో ఆమెను ఆస్పత్రి తరలించేందుకు కుటుంబసభ్యులు నానా కష్టాలు పడ్డారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక, మట్టి పూర్తిగా బురదమయం అయ్యింది. దీంతో బురదలో నడిపిస్తూ అతి కష్టం మీద గర్భిణీని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Tags:    

Similar News