TS Weather Report Today: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

TS Weather Report Today: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2021-08-28 07:30 GMT

తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి వానలు

TS Weather Report Today: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిషా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో బెంగాల్ తీరం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ వద్ద 3.1 కి.మీ వద్ద ఇంకో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాగల 5 రోజులు పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News