Telanagana: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
Telanagana: కరోనా టెస్టుల్లో కోవిడ్ సిబ్బంది అలసత్వం * 15 మందికి పరీక్షలు చేసి కిట్స్ అయిపోయాయంటున్న సిబ్బంది
Telanagana: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టెస్టుల కోసం కరోనా సెంటర్‌కు వచ్చిన ప్రజలతో ఆటలాడుతున్నారు అక్కడి సిబ్బంది. 15 మందికి పరీక్షలు చేసి, 50 మందికి నిర్వహించామని, కిట్స్ అయిపోయాయని టెస్టులను నిలిపివేస్తున్నారు. గత కొన్నిరోజులుగా సిబ్బంది ఇదే తంతు కొనసాగిస్తున్నారని ఆగ్రహానికి లోనైన ప్రజలు.. అక్కడ ఉన్న టెంట్‌ను పీకి పారేశారు. అంతటితో ఆగక.. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సడలింపు సమయంలో రోడ్డుపైకి రావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.