Telangana: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
Graduate MLC Elections Telangana గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
Graduate MLC Electionsతెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరంగల్ ఖమ్మం, నల్గొండ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు విషయంలో ఎటూ తేల్చడం లేదు. అసలు టీఆర్ఎస్ పోటీలో ఉంటుందా లేదా ఎవరికైనా మద్దతు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా..? హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం అంటేనే అధికార పార్టీకి ఎందుకు హడలిపోతుంది..?
వరంగల్ ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తమ క్యాండేట్ కు మద్దతుగా ఆయా జిల్లాల్లో మంత్రులు ముమ్మరం ప్రచారం కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తోంది.
హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుగా టీఆర్ ఎస్ నాయకులు బొంతు రామ్మోహన్, టీఎస్ఏడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్ తదితరులు ఆసక్తి చూపించారు. తీరా సమయం దగ్గరకు వచ్చేసరికి పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్ది విషయంలో డైలామాలో పడింది.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ కు వరుస పరాజయాలు మిగిలాయి. 2007లో పోటీ చేసి ఓటమిపాలుకాగా, 2009లో అసలు పోటీయే చేయలేదు. 2015లో టీఎన్జీఓ అధ్యక్షుడు ఉన్న దేవీ ప్రసాద్ ను బరిలోకి దింపినా పరాజయం తప్పలేదు. ఇలా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కారు బోల్తా పడుతూనే ఉంది.
మరోవైపు బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రారావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై ఆసక్తి చూపించడంలేదు. గ్రాడ్యూయోట్లలో ఉన్న వ్యతిరేఖను గుర్తించి నేరుగా పోటీ చేయకుండా వామపక్షాల అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గెలిచే పరిస్థితులు లేనప్పుడు, పోటీ చేసి పరువు తీసుకోవడం కంటే తటస్థంగా ఉండి మద్దతు ఇవ్వడం మంచిదనే అభిప్రాయం టీఆర్ ఎస్ వర్గాల్లో నెలకొంది.