Telangana Weather: తెలంగాణలో వర్షాల గురించి హైదరాబాద్ లోని వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం ఉంటుందన్నారు. పలు ప్రాంతాల్లో మాత్రం వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చల్లగాలుల తీవ్రత పెరుగుతుందని రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..మరికొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండగాలులు, కొన్ని చోట్ల చలివాతావరణం ఉంటుందని తెలిపారు. అయితే నేడు తెలంగాణలో వాతావరణం గత వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనం మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఆ తర్వాత ఆవర్తనంగా మార్పు చెంది బలహీనపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఆవర్తనం కూడా పూర్తిగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఏమాత్రం అవకాశం లేదన్నారు. అయితే మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఈ జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణం ఉంది. తెలంగాణలో చల్లని గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని జిల్లాల్లో వేడిగాలులు బాగా వీస్తున్నాయి.
కొన్ని జిల్లాల్లో రాత్రి చలి..పగలు వేడి వాతావరణం ఉంటుందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ లో మంగళవారం పగటిపూట సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నాలుగు డిగ్రీలు అధికంగా 35.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఖమ్మంలో 3.3 హైదరాబాద్ నగరంలో 2.2 హన్మకొండలో 2 డిగ్రీలు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.