Telangana: పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్

Telangana: త్వరలోనే పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని హోమ్ మంత్రి మహమూద్ అలీ చెప్పారు.

Update: 2021-06-13 01:55 GMT

Telangana Police Department:(File Image)

Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని హోమ్ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. 20 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నామని తెలిపారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ.. 33 శాతం రిజర్వేషన్ కల్పించామని అలీ పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖలో వివిధ వివిభాగాల్లో దాదాపు 80వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు స్పష్టం చేశారు.

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్‌గా నియమించడం వంటి అనేక నియామకాలు చేపట్టి.. సామాన్యులకు పోలీస్ వ్యవస్థను మరింత దగ్గరగా చేశామని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికే కొత్త రాష్ట్రంలో పోలీస్ శాఖకు కొత్త వాహనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ స‌మ‌ర్థ పోలీసింగ్‌ను నిర్వ‌హిస్తోంద‌న్నారు.

తెలంగాణాలో భారీ సంఖ్యలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశామమని చెప్పారు. వీటి సంఖ్య దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయని.. వీటి సాయంతో కేసులను ఈజీగా చేధిస్తున్నారని .. ఇంకా చెప్పాలంటే ఈ సీసీ కెమెరా ఏర్పాట్లతో నేరాలు చేయాలంటే భయపడుతున్నారని అలీ చెప్పారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారని.. భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News