Revanth Reddy: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం..
Telangana: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
Telangana: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. జాతీయ భావాజాలం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి ఉంటుందన్న రేవంత్.. 119 నియోజకవర్గాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. చెరుకు, జొన్నలు, తెలంగాణ పంటలు తెలంగాణ తల్లిలో ప్రతిబింబిస్తాయని చెప్పారు. జాతీయత ఉట్టిపడేలా కొత్త ఫ్లాగ్ రూపొందిస్తామని, అయితే ఈ ఫ్లాగ్‌లో జిల్లాల మ్యాప్ ఉండదని స్పష్టం చేశారు రేవంత్.
టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి దొరలకు ప్రతిరూపంగా ఉందని ఆయన ఆరోపించారు. ''తెలంగాణ తల్లి అంటే దొర గడీలో మనిషి రూపంలో ఉన్న విగ్రహం కాదు. తెలంగాణ తల్లి అంటే బడుగు బలహీన సబ్బండ పీడిత వర్గాల కోసం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన తెలంగాణ గడ్డ హక్కుల కోసం కర్ర పట్టి కొట్లాడిన వీరనారీ రూపం'' అని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది.