Telangana: టెన్త్ విద్యార్థులంతా పాస్... వారంలో ఫలితాలు!
Telangana: రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులంతా పాసైనట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Telangana: రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులంతా పాసైనట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వం, విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మరికొన్ని రోజుల్లో టెన్త్ ఫలితాలు వెల్లడి కానుండగా, పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులను ఉత్తీర్ణులుగా నిర్ణయించి గ్రేడ్లు ఇస్లారు. కాగా గతేడాది కూడా ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు. 20 శాతం మార్కులతో నిర్వహించిన ఆ ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి గ్రేడింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 20 శాతం మార్కులను 100 శాతానికి లెక్కించి గ్రేడ్లు ఖరారు చేయాలని స్పష్టం చేశారు.