Telangana: తెలంగాణాలోని పలు జిల్లాల వార్తలు

Telangana: తెలంగాణాలోని పలు జిల్లాల వారిగ తాజా వార్తలు

Update: 2021-07-05 01:26 GMT

తెలంగాణా లేటెస్ట్ న్యూస్ 

ఆదిలాబాద్ జిల్లా:

ఆదిలాబాద్ జిల్లాలో హారితహారం కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఎమ్మెల్యే జోగు రామన్న బర్త్‌డే సందర్భంగా గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుర్గానగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25వేల మంది ఒక్క గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షించింది.

మహబూబాబాద్ జిల్లా:

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలో పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. కరోనాతో మరణించిన మావోయిస్ట్ నేత హరిభూషణ్‌ స్వగ్రామంలో కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. దాంతో, గ్రామంలో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. బంధువులను సైతం గ్రామంలోకి అనుమతించకపోవడంతో హరిభూషణ్‌ కుటుంబ సభ‌్యులు ఆవేదన వ్యక్తంచేశారు.

అడ్డగూడూర్‌:

ఛలో అడ్డగూడూర్‌కి దళిత బహుజన సంఘాలు పిలుపునివ్వడంతో పాటిమళ్ల, చౌళ్ల రామారం, అడ్డగూడూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయతే, మరియమ్మ లాకప్ డెత్‌కు కారకులైన పోలీసులను డిస్మిస్ చేయాలని, వాళ్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి.

ములుగు జిల్లా:

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి సందర్శకులు తాకిడి పెరిగింది. బొగత జలపాతం గలగలమంటూ ఉరకలు వేస్తోంది. దాంతో, పర్యాటకులు బొగత జలపాతానికి క్యూ కడుతున్నారు. జలపాతంతోపాటు పచ్చని ప్రకృతి పర్యాటకుల మనసు దోచుకుంటోంది.

Full View


Tags:    

Similar News