Telangana: కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ వాయిదా

Telangana: వ్యాక్సిన్ల కొర‌త రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి ఈ నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర స‌ర్కార్.

Update: 2021-05-17 01:46 GMT

కోవాగ్జిన్(ఫైల్ ఇమేజ్ )

Telangana: వ్యాక్సిన్ల కొర‌త రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి ఈ నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర స‌ర్కార్. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేష‌న్ నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. నిల్వ తగినంత లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున 45 ఏళ్లు పైబడినవారికి కొవాగ్జిన్‌ మలి డోసు పంపిణీని ఆపివేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది.

మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. రాష్ట్రంలో శని, ఆదివారాలు వ్యాక్సినేషన్‌ సాగలేదు. సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది. మరోవైపు కొవాగ్జిన్‌ పంపిణీ నిలిచిపోవడంతో.. కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు పంపిణీ మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News