Sarpanch Election: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి క్లారిటీ

Telangana Sarpanch Election: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-11-02 16:45 GMT

Sarpanch Election in Telangana : తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఔను, డిసెంబర్ నెలలో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో సరదా చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2025 జనవరి నాటికల్లా తెలంగాణలో గ్రామాలకు కొత్త సర్పంచులు వస్తారని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.

తెలంగాణలో 2024 ఫిబ్రవరితోనే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుండి ప్రభుత్వం ఇన్చార్జిలతోనే గ్రామ పాలన నెట్టుకొస్తున్నారు.

అయితే గ్రామాలకు సర్పంచ్ లు లేకపోవడంతో కొన్ని అంశాల్లో అభివృద్ధి కుంటుపడుతోందనే ఆరోపణలున్నాయి. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో కొన్ని ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇవన్నీ ప్రజల కోణంలో కనిపించే సమస్యలు కాగా, సర్పంచ్ ఎన్నికలు ఆలస్యం అవుతుండటం వల్ల కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులను రాబట్టుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక ఆలస్యం లేకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Tags:    

Similar News