Wankidi: చికిత్స చేసినా... మళ్లీ అస్వస్థతకు గురైన విద్యార్థులు

Wankidi: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-11-02 01:42 GMT

Wankidi: చికిత్స చేసినా... మళ్లీ అస్వస్థతకు గురైన విద్యార్థులు

Wankidi: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందించి పంపిన తర్వాతకూడా మళ్ళీ అస్వస్థతకు గురయ్యారని పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. రోజూ కొంత మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బందిని వివరాలు అడుగగా ఒక్కో సారి ఒక్కో తీరు సమాధానం చెప్తున్నారు.

దసరా సెలవుల్లో ఇంటికి వెళ్ళిన విద్యార్థులు తిరిగి వచ్చే క్రమంలో తెచ్చుకున్న పిండి వంటలు తిని అస్వస్థత కు గురయ్యారు అని సిబ్బంది చెప్పినప్పటికీ ఒకే సారి 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడమే కాకుండా రొజూ కొంత మంది విద్యార్థినులు అస్వస్థత కు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థినులు అస్వస్థత కు గురి కావడంతో పిల్లల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.

అంతకుముందు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, మిషన్‌ భగీరథ అధికారులు వచ్చి నీటి, ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించారు. విద్యార్థినుల అస్వస్థతతకు కలుషితమై తాగు నీరు, ఆహారమే కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ శుక్రవారం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల అస్వస్థతతకు గల కారణాలను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోరు నీటి శాంపిళ్లను ఆయన పరిశీలించారు. అనారోగ్యానికి గురైన పిల్లలకు ఆయిల్‌ ఫుడ్‌ కాకుండా పండ్లరసాలు, పెరుగన్నం ఇవ్వాలని, వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హెచ్‌ఎం, వార్డెన్‌ను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

Full View


Tags:    

Similar News