Half Day Schools: నవంబర్‌ 6 నుంచి తెలంగాణలో ఒక్కపూట బడులు.. కారణం ఏంటంటే..?

Half Day Schools: సాధారణంగా వేసవి ప్రారంభంలో ఒక్కపూట స్కూళ్లను నిర్వహిస్తారో విషయం తెలిసిందే.

Update: 2024-11-02 05:12 GMT

Half Day Schools: నవంబర్‌ 6 నుంచి తెలంగాణలో ఒక్కపూట బడులు.. కారణం ఏంటంటే..?

Half Day Schools: సాధారణంగా వేసవి ప్రారంభంలో ఒక్కపూట స్కూళ్లను నిర్వహిస్తారో విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి స్కూళ్లు ఒక్కపూటే పనిచేయనున్నాయి. నవంబర్‌లో ఒక్కపూట ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! అయితే తెలంగాణలో చేపట్టనున్న కులగుణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. ఇందుకుగాను ప్రభుత్వం.. 36 వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని ఉపయోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటనే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి. తర్వాత కులగణనకు ఇంటింటికి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే ఇందులో కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నాయా.? ప్రైటేట్ పాఠశాలలకు కూడా వర్తిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కులగణ విషయానికొస్తే ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల నుంచి 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను రూపొందించారు. కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదని అధికారులు తెలిపారు.

అయితే కులగణనపై బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదని అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్‌కు లేదు కాబట్టి ఇలా ప్రజాభిప్రాయణ సేకరణ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక కుల సంఘాలు కూడా కులగణన, బీసీ కమిషన్‌పై పెదవి విరుస్తున్నాయి. లెక్కలు పక్కాగా రాకపోతే ఊరుకునేదని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News