దీపావళి టపాసుల ఎఫెక్ట్.. సరోజిని ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

Diwali Celebrations: దీపావళి సంబరాలు... తల్లిదండ్రులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి.

Update: 2024-11-01 06:20 GMT

 Diwali Celebrations: దీపావళి సంబరాలు... తల్లిదండ్రులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. టాపాకాయలు, బాణాసంచా కాల్చేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పటికీ, పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడంతో ముఖం, కంటిపరిసరాలు, శరీరంపై కాలిన గాయాలు ఏర్పడ్డాయి. ముఖంపై కాలిన గాయాలతో హైదరాబాద్ సరోజిని ఆస్పత్రికి బాధితులు క్యూకట్టారు. తమ పిల్లలకు కంటి చూపుకాపాడుకోడానికి తల్లిదండ్రులు పండుగ సంబరాలను పక్కనబెట్టి ఆస్పత్రికి తరలివచ్చారు.

గాయపడ్డవారికి ఆస్పత్రి సిబ్బంది.. చికిత్స అందిస్తోంది. ఇప్పటివరకు హాస్పిటల్‌కు 48 మంది బాధితులు రాగా.. వారిలో 8 మందికి తీవ్రగాయాలైనట్టు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డాక్టర్‌ మోదిని స్పష్టం చేశారు. బాధితులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డాక్టర్‌ మోదిని. గతంతో పోలిస్తే ఈ ఏడాది బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News