MLAs Disqualification case: స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. లేదంటే.. - కేటీఆర్
Telangana MLAs Disqualification case: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు. రీజనల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని.. రీజనల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపి వివేకానంద గౌడ్, బీజేపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హై కోర్టులో పిటిషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.