TG Liquor Prices Hike: తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్..త్వరలోనే భారీగా పెరగనున్న మద్యం ధరలు

TG Liquor Prices Hike:

Update: 2024-11-01 03:58 GMT

TG Liquor Prices Hike

TG Liquor Prices Hike: తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలను సవరించే దిశగా ఆబ్కారీ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏపీలో మద్యం ధరలకు సమానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బీరుపై రూ. 20 లిక్కర్ పై రూ. 20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ధరలు పెంచడం ద్వారా ప్రతినెలా రూ. 1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సర్కార్ ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ శాఖలో ఆదాయం రావడం తగ్గింది. గుడుంబాతోపాటు అక్రమ మద్యం తయారీ సరఫరా, విక్రయాలు పెరిగియాని ఆ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదు చేసిన కేసుల సంఖ్య స్పష్టంగా తెలుపుతోంది.

గతేడాది మొదటి ఆరు నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదే సమయంలో 18, 826 కేసులు నమోదయ్యాయి. అంటే రెట్టింపు కేసులు నమోదవ్వడంతో పాటు పదివేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీని అడ్డుకునేందుకు అబ్కారీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ. 36వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 9, 493 కోట్లు, వ్యాట్ ద్వారా మరో రూ. 8, 040 కోట్లు వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఈ రెండింటి ద్వారా రూ. 17, 533 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖలు లెక్కలు చెబుతున్నాయి.

మిగిలిన 6నెలల్లో ఇదే మొత్తం వస్తుందని అంచనా వేస్తే ఈ ఆర్థిక ఏడాదికి రూ. 35,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

Tags:    

Similar News