Diwali 2024: టపాసుల ధరలు.. పేలుతున్నయ్..!

దీపావళి సందర్భంగా మార్కెట్‌లో కేజీ సేల్ అంటూ కొందరు దుకాణదారులు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొన్ని దుకాణాల్లో మాత్రం..

Update: 2024-10-30 06:49 GMT

Diwali 2024: టపాసుల ధరలు.. పేలుతున్నయ్..!

Diwali 2024: నగరంలో దీపావళి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా క్రాకర్స్ స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ధరలు పేలుతున్నాయి. దీపాలతో ఇంటిని అందంగా అలంకరించి, పిండి వంటలతో వంటింటిని ఘుమ ఘుమలాడించి, సాయంత్రం టపాసులు పేల్చి సంబరాలు చేసుకునే దీపావళికి అంతా సిద్ధమవుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం ధరలు పెరిగినట్లు దుకాణదారులు చెబుతున్నారు.

దీపావళి సందర్భంగా మార్కెట్‌లో కేజీ సేల్ అంటూ కొందరు దుకాణదారులు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొన్ని దుకాణాల్లో మాత్రం క్వాలిటీకే మేం ప్రాధాన్యత ఇస్తున్నాం.. ధరలు ఎక్కువయినా కస్టమర్లని మమ్మల్ని ఆదరిస్తారని అంటున్నారు. కేజీ సేల్‌లో టపాసులను రెండు రకాలుగా విభజించి కిలో 450 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అమ్ముతున్నారు.

ఈ కేటగిరీలో గత ఏడాది సుమారుగా 350 రూపాయల నుంచి 900 రూపాయల వరకు లభించేవి. ఫ్యామిలీ ప్యాక్స్ అంటూ కొన్ని రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్యాక్ 2 వేల 500 రూపాయల నుంచి 6 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. విద్యుత్ దీపాలు, మట్టి ప్రమిదలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కొత్త మోడల్ ఎల్ఈడీ విద్యుత్ సీరియల్ సెట్ దీపాలు ప్రత్యేక ఆఫర్లతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

చిన్నపిలు కాల్చే తాళ్లు, మతాబులు, కాకరవత్తులు, అగ్గి పెట్టెలు, ఇతర రకాల వస్తువుల కంటే మార్కెట్‌లో లభిస్తున్నాయి.. థౌసెండ్ వాలా నుంచి దస్ హజార్ వాలా వరకు అందుబాటులో ఉన్నాయి... హైడ్రోజన్, లక్ష్మీ బాంబులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్డీలు, బుల్లెట్ బాంబులు, మతాబులు, ఇతర వెలుగులు విరజిమ్మే రకాలు, పెద్ద శబ్దం వచ్చే రకాల బాంబులకు గిరాకీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టపాసుల విషయంలో వాస్తవానికి వస్తువుల ప్యాకింగ్‌పై ఉన్న ఎంఆర్‌పీ ధరలకు.... వినియోగదారులకు విక్రయించే ధరలకు ఏమాత్రం పాంతన ఉండడం లేదు. కొన్నిరకాల ప్యాకులపై వేల రూపాయల ఎంఆర్‌పీ ముద్రించినా ఆ ప్యాకులు వందల్లోనే దొరుకుతున్నాయి.

ఉదాహరణకు టెన్ థౌజండ్ వాలా ఎంఆర్‌పీ సుమారు 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఉన్నాయి. అమ్మకానికి వచ్చేసరికి 4 వేల 500 నుంచి 8 వేల రూపాయలకు ఇస్తున్నారు. 10 పీసెస్ హైడ్రోజన్ బాంబుల బాక్సుపై ముద్రించిన ధర 670 నుంచి 950 రూపాయల వరకు ఉన్నా... మార్కెట్లో 250 నుంచి 350 రూపాయలకు లభిస్తున్నాయి. ఎంఆర్‌పీలో కనీసం 20 శాతం నుంచి 60 శాతం వరకు రాయితీపై అమ్ముతున్నారు.

Tags:    

Similar News