Janwada Farm House Case: మోకిల పోలీస్ స్టేషన్ కు రాజ్ పాకాల

Janwada Farm House Case: జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

Update: 2024-10-30 07:18 GMT

Janwada Farm House Case: మోకిల పోలీస్ స్టేషన్ కు రాజ్ పాకాల

Janwada Farm House Case: జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఫాంహౌస్ పార్టీ కేసులో విచారణకు రావాలని పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు. తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ పంపారు. ఇవాళ పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. అడ్వకేట్ తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

ఈ నెల 26న రాజ్ పాకాల దివాళీ పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీకి వచ్చిన వారిలో విజయ్ మద్దూరికి మాత్రమే డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. రాజ్ పాకాల డ్రగ్స్ ఇస్తేనే తాను తీసుకున్నట్టుగా విజయ్ మద్దూరి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే తన స్టేట్ మెంట్ లో తాను చెప్పని అంశాలను కూడా చేర్చారని విజయ్ మద్దూరి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసులో విజయ్ మద్దూరిని విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన వాడిన ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News