Diwali 2024: భక్తులకు వెండి నాణేల పంపిణీ... భాగ్యలక్ష్మి ఆలయంలో సందడి..
Diwali 2024: దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ.
Diwali 2024: దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. దీపావళి పండగనాడు సిరుల తల్లి అయినా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. పాతబస్తీలో ఉన్న భాగ్యలక్ష్మి దేవీ ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు వెండి రూపాయి నాణేలను పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి ఖజానా నాణేలను తీసుకోవడానికి వస్తుంటారు. ఈ నాణేలు భక్తులకు అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం. అందుకే ఏటా భక్తులు నాణేలను పొందడం భాగ్యంగా భావిస్తుంటారు.