DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్:డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

TG Govt Employee DA Hike: దీపావళిని పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-10-30 13:33 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్:డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

TG Govt Employee DA Hike: దీపావళిని పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 3.64 శాతం కరవు భత్యం పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జులై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏను చెల్లించనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. 2025 మార్చి 31 లోపు రిటైరయ్యే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల 26న జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ విడుదలకు ఆమోద ముద్ర పడింది.

ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. దీపావళి తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీ ప్రయత్నిస్తోంది. 

Tags:    

Similar News