తెలంగాణలో స్వల్పంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. మరో భారీ పెంపుకు రంగం సిద్ధం..

TSRTC Ticket Prices: తెలంగాణ ఆర్టీసీలో టికెట్ల ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి.

Update: 2022-03-18 15:30 GMT

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. మరో భారీ పెంపుకు రంగం సిద్ధం..

TSRTC Ticket Prices: తెలంగాణ ఆర్టీసీలో టికెట్ల ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. మరో భారీ వడ్డింపు కూడా ముందుంది. ఆరు వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు కిలోమీటరు చొప్పున పెంచాల్సిన రేట్ల ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. దానిమీద త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక తాజాగా చిల్లర సమస్య తలెత్తకుండా అంటూ పల్లెవెలుగు టికెట్ల ఛార్జీల్ని రౌండప్ చేశారు.

దానిమీద రూపాయి పెంచామన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై 2 రూపాయల చొప్పున పెంచారు. సిటీ బస్సుల్లో 5 రూపాయలు పెరిగింది. ఆర్టీసీలో చనిపోయినవారి కుటుంబాల సంక్షేమం కోసం ఒక్కో టికెట్ మీద ఒక రూపాయి సెస్ తీసుకుంటున్నామని, దీని ద్వారా 50 కోట్లు సమకూరుతుందన్నారు గోవర్ధన్. 

Tags:    

Similar News