TS POLYCET 2020 : కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించవలసిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. కానీ కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలించడంతో అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్లుకుని అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాయిదా పడుతూ వస్తున్న టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు అయింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల అంటే సెప్టెంబర్ 12వ తేదీ నుంచి జరగనుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 12 నుంచి 17వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ధ్రువపత్రాలను పరిశీలనను ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అనంతరం వెబ్ ఆప్షన్లను విద్యార్ధులు 14వ తేది నుంచి 20వ తేదీ వరకు ఇచ్చుకోవాలి. 22న సీట్ల కేటాయింపు జరగనుంది.
ఇక పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 30 నుంచి నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్లను 30వ తేదీన, అక్టోబర్ 1న ఇచ్చుకోవాలి. తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపును అక్టోబర్ 3న చేస్తారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం వచ్చే అంటే అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8న ప్రయివేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.