మోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...

Narendra Modi Tour: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన లేదా ?

Update: 2022-05-27 06:23 GMT

మోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...

Narendra Modi Tour: హైదరాబాద్ కి ప్రధాని రాకతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. తెలంగాణ కుటుంబ పాలన సాగుతుందన్న మోడీ కామెంట్స్ కి మంత్రులు ఎదురు దాడికి దిగారు. తెలంగాణ కి కేంద్రం అడుగడుగునా అభివృద్ధి కి అడ్డు తగులుతుందని మంత్రులు కేంద్రంపై విరుచుకుపడ్డారు.. ఇప్పటికే కేంద్రం రాష్ట్రం మధ్య గ్యాప్ ఉన్న నేపథ్యంలో మోడీ పర్యటన మరింత గ్యాప్ ని పెంచింది.

హైదరాబాద్ పర్యటన కి వచ్చిన నరేంద్రమోదీ టీఆర్ఎస్ కుటుంబ అవినీతి పాలన అంటూ విమర్శలు గుప్పించారు.అదే రీతిలో తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మోడీ కి కుటుంబం లేదు కాబట్టి కుటుంబం గూర్చి ఏం తెలుసని మంత్రులు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుటుంబ పాలన లేదా అని ప్రశ్నించారు. మోడీ దేశాన్ని దోచి అదానీ, అంబానీ చేతిలో పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.

బీజేపీకి మతాల పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టుకోవడం అలవాటన్నారు. మతాలను అడ్డుపెట్టుకొని బీజేపీ గెలిచిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఇప్పటికే మోడీ ని గద్దె దింపేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారన్నారు. వచ్చే రోజుల్లో బీజేపీ ని ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు మంత్రి.

గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే మోడీ చూడలేక పోతున్నారన్నారు మంత్రి హరీష్ రావు.విభజన చట్టంలో ని హామీలను ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు..తెలంగాణకి రావాల్సిన వాటాలు హక్కుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లో ఉన్న నాయకుల కుటుంబ సభ్యులు బీజేపీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాలలో లేరా అని ప్రశ్నించారు.

మొత్తానికి మోడీ హైదరాబాద్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకి దారి తీసింది. కేంద్రం, రాష్ట్రం మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంటే మరోసారి మోడీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News