తెలంగాణ పోలీస్‌ యాప్‌ను హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు

తెలంగాణ పోలీస్‌ యాప్ హ్యాక్‌

Update: 2024-06-07 09:45 GMT

తెలంగాణ పోలీస్‌ యాప్‌ను హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు

తెలంగాణ పోలీస్‌ యాప్ హ్యాక్‌కు గురైంది. తెలంగాణ పోలీస్‌ యాప్‌ను హ్యాక్‌ చేశారు కేటుగాళ్లు. గతంలో కూడా హ్యాక్‌ ఐ యాప్‌ హ్యాక్‌ అయింది. యాప్‌లను హ్యాక్‌ చేసి డేటా చోరీ చేస్తున్న నేరగాళ్లు.. చోరీ చేసిన డేటాను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. 120 డాలర్లకు సైబర్‌ నేరగాళ్లు డేటాను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. 12 లక్షల మంది డేటా బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. చోరీ చేసిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News