Harish Rao: మండ‌లి చీఫ్‌విప్‌గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం

Harish Rao: పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఫైర్‌ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు.

Update: 2024-10-13 15:30 GMT

Harish Rao: పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఫైర్‌ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు. పీఏసీ చైర్మన్‌, మండలి చీఫ్‌ విప్‌ విష‍యంలో కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు. చీఫ్‌ విప్‌గా మహేందర్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధమన్న హరీష్.. అనర్హత పిటిషన్‌ చైర్మన్‌ దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు.

వేటు వేయాల్సిన చైర్మనే.. మహేందర్‌రెడ్డి చీఫ్‌ విప్‌గా బులెటిన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. అసలు.. మహేందర్‌రెడ్డి ఏ పార్టీ వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్‌ విష‍యంలోనూ ఇలాగే చేశారని, అరికెపూడి గాంధీకి పీఏసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు హరీష్‌.

Tags:    

Similar News