Alai Balai 2024: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన అలయ్ బలయ్
Alai Balai 2024: అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో జరిగింది.
Alai Balai 2024: అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. ప్రతి ఏటా దసరా సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించేవారు. ప్రస్తుతం దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అందరిని ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరాఖండ్ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, జిష్ణుదేవ్ వర్మ, గుర్మిత్ సింగ్, ఎమ్మెల్సీ కోదండరామ్ సహా పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.