మూడు నెలల పాటు దివ్యమైన ముహూర్తాలు.. ఇక లగ్గాలే లగ్గాలు..

Wedding Season: హైదరాబాద్ లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే మూడు నెలలు శుభ ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు.

Update: 2024-10-13 05:40 GMT

మూడు నెలల పాటు దివ్యమైన ముహూర్తాలు.. ఇక లగ్గాలే లగ్గాలు..

హైదరాబాద్ లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే మూడు నెలలు శుభ ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. రెండుమూడేళ్లలో హైదరాబాద్ జరిగిన వివాహాలతో పోల్చితే ఈ మూడు నెలల్లో అత్యధికంగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకెట్‌ హాళ్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌లు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబులాలు మార్చుకుని వివాహానికి సిద్ధమవుతున్నారు.

ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకెట్‌ హాళ్లను బుకింగ్‌ చేసుకున్నారు. ఈ నెలలో దసరా పండగ తోపాటు శుభకార్యాలు ఉండటంతో మార్కెట్లు కిటకిలాడుతున్నాయి. వస్త్ర, బంగారం దుకాణాల్లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బంగారం ధర పెరిగినప్పటికీ ఆభరణాలు తయారీకి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వివాహాలు చేసుకోవాలనే వారు డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నారు. ముహూర్తాలు పెట్టుకున్నవారు మండలపాలు అలంకరించే వారికి, కేటరింగ్‌ వారికి ఆర్డర్లు ఇస్తున్నారు.

ఫొటో, వీడియోగ్రాఫర్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఎంగేజ్‌మెంట్‌ పూర్తి చేసుకున్న దంపతులు ఫొటో షూట్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఫంక్షన్‌హాళ్లు అన్నీ దాదాపు ముందస్తుగా బుకింగ్‌ అయినట్టునిర్వాహకులు చెబుతున్నారు. మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు ఉండటంతో బుకింగ్‌లు అధికంగా వస్తున్నాయి. . .

పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నవారు ఒక నెల ముందుగానే గార్డెన్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో 23 అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలల్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈనెల ఎంతో అనుకూలమని పురోహితులు చెబుతున్నారు. 

Tags:    

Similar News