HMDA పరిధిలో స్థలం లేదా ఇల్లు కొంటున్నారా.. అయితే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఇలా చెక్ చేసుకోండి.. లేకపోతే కోట్లలో నష్టం తప్పదు

HMDA : హైదరాబాదులో సొంతిల్లు కొనుగోలు చేయడం అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు తమ జీవితాంతం సంపాదించిన సంపాదనను పెట్టుబడిగా పెట్టేందుకు కూడా వెనకాడరు. ఇందుకోసం బ్యాంకుల నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు లోన్ కూడా తీసుకుంటారు. ప్రతి నెల తమ ఆదాయంలో దాదాపు 40 శాతం వరకు ఈఎంఐ కట్టడానికి కూడా వెనకాడరు.

Update: 2024-10-12 04:57 GMT

అలాంటి సొంతింటి కలను ఎలాంటి అడ్డంకులు లేకుండా సాకారం చేసుకోవడం అనేది తప్పనిసరి. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా హైడ్రా హడల్ కనిపిస్తోంది. హైదరాబాదులో చాలావరకు చెరువులు, కాలువలు, అప్రోచ్ కెనాల్స్ ఆక్రమించి లేఔట్లుగా మార్చి రియల్టర్లు విక్రయిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది చట్టవిరుద్ధమైన పని అని చెప్పవచ్చు. నదులు, చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది. వాటికి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే క్యాచ్ మెంట్ ఏరియా ఉంటాయి.

ఉదాహరణకు ఒక చెరువుకు 30 మీటర్ల వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే, ఆపైన బఫర్ జోన్ 50 మీటర్ల వరకు ఉంటుంది. ఈ విధంగా ఖాళీ స్థలాన్ని వదలడం ద్వారా చెరువులు పొంగకుండా వాటి స్థానంలో నిండుగా ఉంటాయి. అయితే నగరంలో కొద్దీ జనాభా పెరిగే కొద్దీ చెరువుల బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కూడా అక్రమ లేఔట్లు వేసి ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇలా చేయడం చెట్ట విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే మీరు ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ప్లాటు లేదా ఇల్లు, బఫర్ జోన్, FTL పరిధిలో ఉందా, లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకునేందుకు HMDA ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. హైదరాబాదులో ఉన్న చెరువులను గుర్తించి, వాటి బఫర్ జోన్ నిర్ణయించింది. నిజానికి బఫర్ జోన్ లో వ్యవసాయం లేదా ఇతర వ్యవసాయ సంబంధిత పనులు చేసుకోవచ్చు. కానీ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు.

వీటికి పట్టా కూడా ఉంటుంది. కానీ చట్టంలో ఉన్న లూప్ హోల్ ను వాడుకొని కొంతమంది, ఈ పట్టాను అడ్డం పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా HMDA ఒక అఫీషియల్ వెబ్ సైట్ విడుదల చేసింది. https://lakes.hmda.gov.in/ ఇందులో మీ జిల్లా, మండలము, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ లేదా ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు.

తద్వారా మీరు కష్టపడి కొనుగోలు చేసిన ఇల్లు సురక్షితమా కాదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్న ప్లాటు బఫర్ జోన్ లో కనుక ఉన్నట్లయితే, అది నివాసయోగ్యం కాదు అన్న సంగతి గుర్తించాలి. . అందుకే మీరు ముందుగానే ప్లాట్ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా ఈ వెబ్సైట్ ద్వారా సర్వే నెంబర్లను గుర్తించవచ్చు. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు.

Tags:    

Similar News