Jagital: ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...

Jagital: జగిత్యాల పట్టణంలో ఓ ఉడిపి హోటల్ లో కస్టమర్ కు సర్వీస్ చేసిన పదార్ధంలో జెర్రి బయటపడింది.

Update: 2024-10-13 09:15 GMT

Jagital: ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...

Jagital: జగిత్యాల పట్టణంలో ఓ ఉడిపి హోటల్ లో కస్టమర్ కు సర్వీస్ చేసిన పదార్ధంలో జెర్రి బయటపడింది. గణేష్ భవన్ ఉడిపి హోటల్ లో ఓ కస్టమర్ పిల్లలకు టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. హోటల్ సిబ్బంది ఇచ్చిన ఇడ్లీలో జెర్రి కనిపించింది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకు వెళ్లాడు కస్టమర్. అయినా ఓనర్ ఇడ్లీలో పడింది జెర్రి కాదు అంటూ ఆ ఇడ్లీని నోట్లో వెసుకున్నాడు.

ఆ వెంటనే ఇడ్లీని వాంటింగ్ చేసుకున్న ఓనర్ జెర్రిగా గుర్తించారు. వెంటనే హోటల్ లోని ఇడ్లీలను బల్దియా ట్రాక్టర్ లో తరలించే ప్రయత్నం చేశారు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు అడ్డుకున్నారు. యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ హోటల్ ముందు బైఠాయించారు. 

Tags:    

Similar News