తెలంగాణ సాధనలో అందరిని ఏకం చేయడంలో అలయ్ బలయ్ కీలకపాత్ర: రేవంత్ రెడ్డి

అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను అలయ్ బలయ్ ద్వారా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.

Update: 2024-10-13 11:45 GMT

తెలంగాణ సాధనలో అందరిని ఏకం చేయడంలో అలయ్ బలయ్ కీలకపాత్ర: రేవంత్ రెడ్డి

అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను అలయ్ బలయ్ ద్వారా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత 19 ఏళ్ల నుంచి దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా గౌరవించే బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ను ఏర్పాటు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కు అలయ్, బలయ్ స్పూర్తిగా  ఉపయోగపడిందని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీ ల వారీగా కార్యక్రమాలు జరిగేవి..తెలంగాణ సాధనలో అన్ని వర్గాలు కార్యోన్ముఖులై అడుగు ముందుకు వేయడానికి అలయ్ బలయ్ ఒక కారణమన్నారు.

తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా.  దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలానే అలయ్ బలయ్ అంటే గుర్తుకు వచ్చేది బండారు దత్తాత్రేయ అని సీఎం చెప్పారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మిని ఆయన  అభినందించారు.తమ ప్రభుత్వం,పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పామన్నారు.

Tags:    

Similar News